రష్యాలో భారీ భూకంపం

రష్యాలో భారీ భూకంపం సంభవించింది. ఈరోజు తెల్లవారుజామున రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.0 గా నమోదైంది.

By :  Vamshi
Update: 2024-08-18 07:23 GMT

రష్యాలో తీవ్ర భూకంపం సంభవించింది. ఈరోజు తెల్లవారుజామున రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 7.0 గా నమోదైంది. రష్యా తూర్పు తీరంలోని మెయిన్ నావెల్ హెడ్‌క్వర్టర్‌కు సమీపాన భూమి ఒక్కసారిగా కంపించింది. ఆస్థి నష్టం, ప్రాణ నష్టం ఏమి జరగలేదని అక్కడి అధికారులు పేర్కొన్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 5.25 గంటలకు కంచట్కా ద్వీపకల్పంలో 7.0 తీవ్రతతో భూమి కంపించింది.

తూర్పు తీర ప్రాంత నగరమైన పెట్రోపవ్‌లావ్‌స్కీ-కమ్‌చట్‌స్కీకి 102 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. 50 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. భూకంపం ధాటికి ఇండ్లలో వస్తువులు కిందపడిపోయాయి. భారీ భూకంపం నేపథ్యంలో హొనులులు లోని యూఎస్ నేషనల్ సర్వీస్‌కు చెందిన పసిఫిక్ సునామా హెచ్చరిక కేంద్రం తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే కొద్దిసేపటి తర్వాత సునామా హెచ్చరికలను ఉపసంహరించుకుంది.

Tags:    

Similar News