స్వల్ప నష్టాల్లో మార్కెట్‌

గురువారం ఈక్విటీ మార్కెట్లలో నిస్తేజం నెలకొన్నది. వరుసగా రెండో రోజు కూడా ఈక్విటీ సూచీలు స్వలంగా నష్టపోయాయి.

By :  Raju
Update: 2024-07-12 01:53 GMT

దిగ్గజ కంపెనీలు మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించనుండటం, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ నేపథ్యంలో మదుపరులు అప్రమత్తమయ్యారు. దీంతో గురువారం ఈక్విటీ మార్కెట్లలో నిస్తేజం నెలకొన్నది. వరుసగా రెండో రోజు కూడా ఈక్విటీ సూచీలు స్వలంగా నష్టపోయాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా, ఐరోపా సూచీలు అదే ధోరణిలో ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ 27.43 పాయింట్ల నష్టంతో 79,897.34 వద్ద ముగియగా నిఫ్టీ 8.50 పాయింట్ల నష్టంతో 24,315.95 వద్ద ముగిసింది.

ఉదయం సెన్సెక్స్‌ 80,170.09 పాయింట్ల వద్ద లాభాల్లోనే ఆరంభమైంది. అమ్మకాలతో నష్టాల్లోకి వెళ్లిన సూచీ ఒక దశలో 79,464.38 పాయింట్ల వద్ద కనిష్టానికి పడిపోయింది. మళ్లీ కోలుకున్న సెన్సెక్స్‌ 27.43 పాయింట్ల నష్టంతో 79,897.34 వద్ద ముగియగా, నిఫ్టీ 8.50 పాయంట్ల నష్టంతో 24,315.95 వద్ద ముగిసింది.

డాలర్‌తో పోలిస్తే రూ 2 పైసలు తగ్గి 83.53 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 85 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతున్నది. 

Tags:    

Similar News