వర్షాలు, వరదల కారణంగా పలు రైళ్ల రద్దు

కేసముద్రం వద్ద శరవేగంగా రైల్వే ట్రాక్‌ పునరుద్ధరణ పనులు

By :  Raju
Update: 2024-09-03 12:10 GMT

వర్షాలు, వరదల కారణంగా 560 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. 185 రైళ్లను దారి మళ్లించగా 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపింది. ఇవాళ 108 రైళ్ల రద్దు , 31 రైళ్లను దారి మళ్లించింది. రేపు 88 రైళ్లు రద్దు, ఒక రైలు దారి మళ్లించినట్లు పేర్కొన్నది. అలాగే ఎల్లుండి 61 రైళ్లను, 6న 13 రైళ్లు, 7న 3 రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది. వరద ఉధృతికి కొట్టుకుపోయిన కేసముద్రం ఇంటికన్నె రైల్వే ట్రాక్ పునరుద్దరణ పనులు కొనసాగుతున్నాయి. రేపు ఉదయం వరకు ట్రాక్ సిద్దమయ్యే అవకాశం ఉన్నది.

వర్షాల వల్ల విజయవాడ పరిధిలో పలు రైళ్లు రద్దు

తిరుపతి మీదుగా వెళ్లాల్సిన పలు రైళ్లు రద్దు అయ్యాయి. కృష్ణ, శబరి, విశాఖ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దయ్యాయి. మరికొన్ని రైళ్లు తెనాలి జంక్షన్‌ మీదుగా దారి మళ్లించారు. పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ ఐదున్నర గంటలు ఆలస్యంగా నడుస్తున్నది.

భారీ వర్షం.. పలు రైళ్లు దారి మళ్లింపు

రైలు నంబర్‌ 11019 సీఎస్‌టీ ముంబయి-భవనేశ్వర్‌ కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ కాజీపేట-వరంగల్‌-ఖమ్మం బదులుగా పగిడిపల్లి-నల్గొండ-గుంటూరు మీదుగా మళ్లింపు

రైలు నంబర్‌ 20806 ఢిల్లీ-విశాఖపట్నం-ఏపీ ఎక్స్‌ప్రెస్‌ బల్హర్ష-వరంగల్‌-విజయవాడ-దువ్వాడకు బదులుగా నాగ్‌పూర్‌-రాయ్‌పూర్‌-టిట్లాగఢ్‌-రాయగడ-విజయనగరం మీదుగా మళ్లింపు

రైలు నంబర్‌ 11020 భువనేశ్వర్‌-సీఎస్‌టీ ముంబయి కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ ఖమ్మం-వరంగల్‌-కాజీపేటకు బదులుగా గుంటూరు-నల్గొండ-పగిడిపల్లి మీదుగా ప్రయాణం

రైలు నంబర్‌ 18519 విశాఖపట్నం-లోకమాన్య తిలక్‌ టెర్నినస్‌ ఎక్స్‌ప్రెస్‌ ఖమ్మం-వరంగల్‌-కాజీపేటకు బదులుగా గుంటూరు-నల్గొండ-పగిడిపల్లి మీదుగా దారి మళ్లింపు

షాలిమార్‌ బయలుదేరే రైలు నంబర్‌ 18045 షాలిమార్‌-హైదరాబాద్‌ ఈస్ట్‌ కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ గుంటూరు-నల్గొంగ-పగిడిపల్లి మీదుగా మళ్లించిన మార్గంలో ప్రయాణం

Tags:    

Similar News