నీతి ఆయోగ్ మీటింగ్‌ నుంచి మమత వాకౌట్‌

మాట్లాడాలనుకున్నా మైక్‌ కట్ చేయడం అవమానకరమని కేంద్రం తీరుపై బెంగాల్‌ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

By :  Raju
Update: 2024-07-27 08:02 GMT

ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ 9వ పాలక మండలి సమావేశం ప్రారంభమైంది. వివిధ రాష్ట్రాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌లు, కేంద్ర మంత్రులు, ప్రత్యేక ఆహ్వానితులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.సమావేశం మధ్యలో నుంచే బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ బైటికి వచ్చారు. తనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని, ఐదు నిమిషాలు మాత్రమే అనుమతించారని ఆమె మండిపడ్డారు.

సమావేశం నుంచి బైటికి వచ్చిన అనంతరం ఆమె మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వాలపై వివక్ష చూపెట్టకూడదని నేను కేంద్ర ప్రభుత్వానికి చెప్పాను. దీనిపై మాట్లాడటానికి నాకు ఐదు నిమిషాలు మాత్రమే ఇచ్చారు. తనకంటే ముందు 10-20 నిమిషాలు మాట్లాడారు. తాను మాట్లాడుతుండగానే మైక్‌ కట్‌ చేశారని ఆమె విమర్శించారు. విపక్షాల నుంచి తాను మాత్రమే సమావేశంలో పాల్గొన్నానని, కానీ మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం అవమానించడమే అని మమతా ధ్వజమెత్తారు.

ఈ సమావేశాన్ని కాంగ్రెస్‌ పాలిత సీఎంలు బహిష్కరించగా ..తమిళనాడు, కేరళ, పంజాబ్‌ రాష్ట్రాల సీఎంలు దూరంగా ఉన్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ కూడా గైర్హాజరయ్యారు. నితీశ్‌ గతంలోనూ నీతి ఆయోగ్‌ సమావేశాలకు హాజరుకాలేదు. 

Tags:    

Similar News