రుణమాఫీ నిబంధనలే రైతుకు ఉరితాడు: ఈటల

ఎన్నికల్లో రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు మాఫీకి నిబంధనలు పెట్టడంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

By :  Raju
Update: 2024-07-16 12:54 GMT

రుణమాఫీ నిబంధనలే రైతులకు ఉరితాళ్లు అని, నిబంధనల పేరుతో తగ్గించడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చూస్తున్నారని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాత మాట్లాడుతూ.. ఆరు పేజీలతో ప్రభుత్వం విడుదల చేసిన నియమ నిబంధనలే రైతులకు ఉరితాళ్లు. ఈ నియమ నిబంధనలే రైతాంగాన్ని మరోసారి వంచించడం, మోసం చేయడం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేదన్నారు. ఈ ప్రభుత్వానికి విశ్వసననీయత లేదన్నారు. పొమ్మనలేక పొగబెట్టడంలా ప్రజలను ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడం తప్పా మరొకటి కాదన్నారు.

దరఖాస్తులు తీసుకుని ఏడు నెలలు అయినా ఇప్పటికీ రేషన్‌ కార్డులు ఇవ్వని సీఎం రుణమాఫీ కావాలంటే తెల్లరేషన్‌ కార్డు ఉండాలనే నిబంధనలు పెట్టడం ఏమిటి అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను ఓడించాలని కాంగ్రెస్‌ అడ్డగోలు హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చి ఏడు నెలల పాలనలో ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉన్న 69 లక్షల మంది రైతాంగం రుణమాఫీ జరుగుతుందని, మా అప్పుల ఊబి నుంచి బైట పడుతామని ఎదురుచూశారో వాళ్లకు ఈ ప్రభుత్వం నిరాశే మిగిల్చిందన్నారు. మాకు ఐదేళ్లు అధికారం ఉన్నదని ఏమైనా చేయవచ్చని రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ బహిరంగ సభల్లో కిసాన్, యువ, దళిత పాలసీలు ప్రకటించింది. కానీ అధికారంలోకి వచ్చాక రేవంత్‌ తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేశారని విమర్శించారు.

Tags:    

Similar News