నాగార్జునసాగర్‌ జలాశయం గేట్ల ఎత్తివేత

నాగార్జునసాగర్ జలాశయం 6 గేట్లు తెరిచి నీటిని విడుదల చేశారు.

By :  Vamshi
Update: 2024-08-05 06:14 GMT

నాగార్జున సాగర్ 6 గేట్లు తెరచి నీటిని విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి 4.40 లక్షల క్యూసెక్కుల ప్రవాహంతో వరద పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు 6 ఎత్తి నీటిని విడుదల చేశారు. సాగర్‌లో 580 అడుగుల వద్ద 283 టీఎంసీల నీరు ఉంది. మొదట 50 వేల క్యూసెక్కులు విడుదల చేయనున్నారు.

సోమవారం ఉదయం 10 గంటలకు డ్యామ్ అధికారులు రేడియల్‌ క్రస్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు పంపించారు. ముందుగా దిగువప్రాంతాల అప్రమత్తత కోసం మొదటి సైరన్‌ మోగించిన అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.. మూడో సైరన్‌ తర్వాత నీటిని విడుదల చేశారు. అయితే సాగర్ గేట్లు తెరుస్తున్నందున పరివాహక ప్రాంత ప్రజలను ముందుగానే అధికారులు అప్రమత్తం చేశారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది.

Tags:    

Similar News