కొండచరియలు విరిగిపడిన ఘటన.. నాలుగుకు చేరిన మృతుల సంఖ్య

విజయవాడలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. భారీ వర్షాల కారణంగా మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్‌ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి.

By :  Raju
Update: 2024-08-31 10:35 GMT

విజయవాడలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. భారీ వర్షాల కారణంగా మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్‌ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కొండ చరియలు విరిగిపడి మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఓ ఇల్లు పూర్తిగా దెబ్బతినగా మరో మూడు ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి.దెబ్బతిన్న ఇళ్లలో ఎంత మంది ఉన్నారో అధికారులు పరిశీలిస్తున్నారు. విజయవాడంలో రెండురోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. విజయవాడ రామవరప్పాడు రింగ్‌రోడ్డు వద్ద ట్రాఫిక్‌ ఇబ్బందులు తతెత్తాయి. రింగ్‌రోడ్‌ నుంచి నడమానూరు వరకు వర్షపు నీటిలోనే కార్లు, బైకులు ఆగిపోవడంతో రాకపోకలు బంద్‌ అయ్యాయి. 

రాష్ట్రంలో భారీ వర్షాలపై హోం శాఖ, విపత్తు నిర్వహణ శాఖ అప్రత్తమైంది. జిల్లా కలెక్టర్లతో హోం మంత్రి వంగలపూడి అని ఫోన్లో మాట్లాడారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ప్రత్యేక బలగాలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. విజయవాడలో కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందడంపై హోం మంత్రి విచారం వ్యక్తం చేశారు.

మంగళగిరిలో వర్షానికి రత్నాల చెరువు ప్రాంతం నీట మునిగింది. ఇళ్లలోకి వరద నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో మంగళగిరి తహసీల్దార్‌ సుభాని పర్యటించారు. బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. 

గుంటూరు ఉప్పలపాడులో విషాదం

గుంటూరు ఉప్పలపాడులో విషాదం చోటుచేసుకున్నది. వరద ఉధృతికి మురుగువాగులోకారు కొట్టుకుపోయింది. కారులో ప్రయాణిస్తున్న టీచర్‌ సహా ఇద్దరు విద్యార్థులు చనిపోయారు. మృతులు రాఘవేంద్ర, సాత్విక్‌, మాన్విక్‌గా గుర్తించారు. 

Tags:    

Similar News