సాగుపై అవగాహన లేదు.. నీళ్లిచ్చే ఉద్దేశం లేదు: జగదీశ్‌

మేడిగడ్డ దగ్గర 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథా పోతున్నాయని, ఈ ప్రభుత్వానికి నీళ్లిచ్చే ఉద్దేశం లేదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు.

By :  Raju
Update: 2024-07-27 06:18 GMT

వ్యవసాయంపై కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఒక్క మంత్రికి అవగాహన లేదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.... కృష్ణ, గోదావరి నదులు ఆంధ్రా కోసమే పుట్టినట్లు గతంలో పాలకులు వ్యవహరించారు. నీళ్లు ఎలా లిఫ్ట్‌ చేయాలో తెలిసి కేసీఆర్‌ కన్నెపల్లి పంప్‌ హౌస్‌ నిర్మించారని తెలిపారు. విహార యాత్రలు చేయడం కాంగ్రెస్‌ నేతలకు అలవాటని విమర్శించారు. ఇప్పుడు రామగుండం దగ్గర గోదావరి ఎలా ఉన్నదో చూడాలన్నారు.

మేడిగడ్డకు ఏదో జరిగిందని ప్రభుత్వం అసత్యాలు చెబుతున్నది. మల్లన్నసాగర్‌, కొండ పోచమ్మ సాగర్‌, సింగూరు ప్రాజెక్టులు నీళ్లు లేక ఉండిపోతున్నాయి. కోదాడ, సూర్యపేట నియోజకవర్గాల్లో నీళ్ల కోసం రైతులు ఎదురుచూస్తున్నారని చెప్పారు. మేడిగడ్డ దగ్గర 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథా పోతున్నాయని, ఈ ప్రభుత్వానికి నీళ్లిచ్చే ఉద్దేశం లేదన్నారు.కాంగ్రెస్‌, బీజేపీ కలిసి కాళేశ్వరంపై నాటకాలు ఆడాయని, ఎన్డీఎస్‌ఏ హైదరాబాద్‌ రాకుండా ఢిల్లీ నుంచే కిషన్‌రెడ్డి చెప్పినట్లు రిపోర్టు ఇచ్చిందని జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. 

Tags:    

Similar News