రాష్ట్రంలో డెంగ్యూ కేసులు పెరగడంపై కేటీఆర్ ఆందోళన

తెలంగాణలో వ్యాప్తంగా లక్షల మంది ప్రజలు విష జ్వరాల బారిన పడి బాధపడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. విద్యా, ఆరోగ్య ఉదాసీనతపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.

By :  Vamshi
Update: 2024-08-27 05:05 GMT

తెలంగాణలో వ్యాప్తంగా లక్షల మంది ప్రజలు విష జ్వరాల బారిన పడి బాధపడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. విద్యా, ఆరోగ్య ఉదాసీనతపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో డెంగీ కేసులు విపరీతంగా పేరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది 36 శాతం డెంగీ కేసులు నమోదం అవ్వడం అందరినీ కలవర పెడుతోందని అన్నారు. సర్కార్ ఆసుపత్రులతో సహా అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ట్రిట్‌మెంట్‌‌కు బెడ్లు దొరకని పరిస్థితి ఉందని అక్షేపించారు. ఒక్కో బెడ్ మీద ఇద్దరు లేదా ముగ్గురికి చికిత్స అందజేస్తున్నారని పేర్కొన్నారు.

గవర్నమెంట్ దవాఖానాల్లో సరిపడా మందులు కూడా అందబాటు లేవని ఆయన అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు నిజాలు దాస్తుందో తెలియడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన పరిస్థితి తలెత్తిందని కేటీఆర్ అన్నారు. మరోవైపు విద్యా వ్యవస్థపై ట్వీట్ చేశారు. చేప్పేవారు లేక ఆదిలాబాద్ జిల్లాలో 43 ప్రభుత్వ స్కూల్స్ మూత పడ్డాయని పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని గిరిజన ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి. మారుమూల ప్రాంతాల్లో పనిచేయడానికి టీచర్‌లు ఇష్టపడకపోవడం, బదిలీ అయిన స్థానంలో మరొకరు రాకపోవడం, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో నాలుగు జిల్లాల్లోని 43 పాఠశాలలు పక్షం రోజుల నుంచి మూతపడి ఉన్నాయి.

Tags:    

Similar News