కేటీఆర్‌ కు ఫెస్టివల్‌ ఆఫ్‌ ఫ్యూచర్‌ పోర్టల్‌ ఆహ్వానం

మాస్కోలో ప్రసంగించాలని ఆహ్వానించిన సంస్థ

Update: 2024-08-28 11:55 GMT

బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. రష్యాలోని మాస్కో లో స్కోక్లోవో. స్టార్టప్‌ సంస్థ ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక ఈవెంట్‌ లో పాల్గొనాలని ఆహ్వానం పంపింది. ‘ఫ్యూచరిస్టిక్’ అనే అంశంపై భవిష్యత్ లో ఉండే అవకాశాలు, వాటిని వినియోగించుకునే విధానాలపై 30 నిమిషాల పాటు మాట్లాడాలని కోరింది. రష్యా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ 5 నుంచి 7వ తేదీ వరకు వరకు ‘ఫెస్టివల్ ఆఫ్ ది ఫ్యూచర్ పోర్టల్ 2030-2050లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆవిష్కరణలకు అందజేసిన ప్రోత్సహకాలు, ఇతర అంశాలను తమతో పంచుకోవాలని ఆర్గనైజర్స్‌ కోరారు. ప్రముఖ శాస్త్రవేత్తలు, భవిష్యత్‌ ఇన్నోవేటర్స్‌, కళారంగానికి చెందిన ప్రముఖులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి రేపటి తరానికి మార్గదర్శనం చేయడం.. వారికి ఒక వేదిక అందించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సులో ఫ్యూచరాలజిస్టులు, ప్రపంచ స్థాయి మేధావులు, శాస్త్రవేత్తలు, టెక్నాలజీ రంగంలో దిగ్గజాలు, పారిశ్రామికవేత్తలు పాల్గొననున్నారు.

Tags:    

Similar News