ఎమ్మెల్సీ కవితతో కేటీఆర్, హరీష్ రావు ములాఖాత్

తీహార్ జైలులో ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ములాఖత్‌ అయ్యారు.

By :  Vamshi
Update: 2024-07-05 13:56 GMT

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్‌ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ములాఖత్‌ అయ్యారు. కవితను కలిసిన కేటీఆర్‌ ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమెతో మాట్లాడి ధైర్యంగా ఉండాలని కోరారు..న్యాయవ్యవస్థ పైన పూర్తి నమ్మకం ఉందని, త్వరలోనే బెయిల్ లభిస్తుందని ఇరువురు భరోసా వ్యక్తం చేశారు.

హైకోర్టు ఎమ్మెల్సీ కవిత బెయిల్ అభ్యర్థన తిరస్కరించిన నేపథ్యంలో...సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కవితకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి రెండు వారాల పాటు పొడిగించిన విషయం తెలిసిందే. సీబీఐ నమోదు చేసిన కేసులో ఈ నెల 21 వరకు ఆమెకు రిమాండ్‌ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 21న జరగనుంది.

Tags:    

Similar News