రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్

వాతావరణ శాఖ ఆగస్టు 27న చేసిన హెచ్చరికలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.

By :  Vamshi
Update: 2024-09-02 15:27 GMT

వాతావరణ శాఖ ఆగస్టు 27న చేసిన హెచ్చరికలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. రాష్ట్రంలోని కుంభకర్ణ రేవంత్ సర్కార్ నుండి కనీస స్పందన లేదు. ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోలేదని కేటీఆర్ పేర్కొన్నారు. రేవంత్ సర్కార్ నేరపూరిత నిర్లక్ష్యం ఖరీదు ఒక యువ శాస్త్రవేత్తతో పాటు సుమారు ఇరవై మంది ఈ వరదల్లో ప్రాణాలు కోల్పోయారన్నారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఒక మంత్రి హెలికాప్టర్లు దొరకలేదంటాడు.

మరొక మంత్రి, ఈ రాష్ట్రానికి సీఎం లేనట్టు పక్క రాష్ట్రపు సీఎంకు ఫోన్ చేస్తాడు. మూడో మంత్రి ఫోటోలకు పోజులకే పరిమితమవుతాడని కేటీఆర్ అన్నారు. జరగాల్సిన నష్టమంతా జరిగాక పూల డెకరేషన్ స్టేజీ మీద కూర్చొని వరదల మీద సమీక్ష చేసే చీప్ మినిస్టర్ ఉల్టా చోర్ కొత్వాల్‌కో డాంటే అన్నట్టు వరదలొస్తే సాయం చేయకుండా ప్రతిపక్షం ఏం చేస్తుందని ప్రశ్నిస్తాడని మాజీ మంత్రి పేర్కొన్నాడు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రూ.25 లక్షల నష్టపరిహారం డిమాండ్ చేస్తారు. ఇప్పుడు రూ.5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటారా?. ప్రతిపక్షాలు ఎన్ని ప్రజాసమస్యలు ఎత్తిచూపినా స్పందించరు. వరదలతో సతమతమవుతున్న ప్రజలు సాయం కోరితే లాఠీచార్జీలతో వారిని హింసిస్తారా?. సిగ్గు తెచ్చుకోండి ముఖ్యమంత్రి గారు’’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు.


Tags:    

Similar News