సీఎం రేవంత్ రెడ్డికి క్రిశాంక్ బహిరంగ లేఖ

లిక్కర్ కంపెనీలకు అనుమతులు ఇవ్వవద్దని క్రిశాంక్ బహిరంగ లేఖ

Byline :  Vamshi
Update: 2024-06-07 10:48 GMT

తెలంగాణలో కల్తీ మద్యం ప్రవేశపెట్టవద్దని బీఆర్‌ఎస్ నేత మన్నే క్రిశాంక్ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ఎలాంటి మద్యం కంపెనీలకి పర్మిషన్‌లు ఇవ్వలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు గోప్ప మాటలు చెప్పారని క్రిశాంక్ అన్నారు. ఎలాంటి లిక్కర్ అనుమతులు ప్రతిపాదనలు పంపించలేదని గతంలో మంత్రి జూపల్లి చెప్పారని ఆయన అన్నారు. అలాంటి న్యూస్ రాస్తే రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారని గుర్తు చేశారు. కానీ ఆ తర్వాత సోం డిస్టిలరీస్ అనే సంస్థకు సర్కార్ అనుమతులు ఇచ్చామని చెప్పారని పేర్కొన్నారు. అయితే ఈ విషయమై తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారన్నారు.

ఇది మంత్రి బాద్యతారాహిత్య ప్రకటన అన్నారు. దయచేసి కమీషన్ కోసం రేవంత్ ప్రభుత్వం నకిలీ బీరును తయారు చేసే కంపెనీలకు అనుమతులు ఇచ్చి ఆరోగ్యానికి హానీకరమైన మద్యాన్ని రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకు రావొద్దని కోరారు. తమ విజ్ఞప్తిని స్వీకరించి సోం డిస్టిలరీస్‌కు ఇచ్చిన అనుమతులను తక్షణమే రద్దు చేయాలని కోరారు. సోం డిస్టిలరీస్ సంస్థ రాష్ట్ర ఆదాయన్నికి గండికొడుతూ ప్రభుత్వ సంస్థల వద్ద రుణాలను తీసుకొని ఎగ్గొడుతూ కల్తీ మద్యం వ్యాపారం చేయడంలో ప్రఖ్యాతిగాంచిందని ఆరోపించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కల్తీ మద్యం లేకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడారని క్రిశాంక్ తెలిపారు.

Tags:    

Similar News