హమాస్‌ లీడర్‌గా ఖలేద్‌ మెషాల్‌?

హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా టెహ్రాన్‌లో హత్యకు గురైన నేపథ్యంలో ఖలేద్‌ మెషాల్‌ పేరు తెరపైకి వచ్చింది.

By :  Raju
Update: 2024-08-01 02:21 GMT

హమాస్‌ చీఫ్‌ ఇస్మాయిల్‌ హనియా టెహ్రాన్‌లో హత్యకు గురైన నేపథ్యంలో ఖలేద్‌ మెషాల్‌ పేరు తెరపైకి వచ్చింది. ఖలేద్‌ 15 ఏళ్ల వయసులో ఈజిప్టునకు సంబంధించిన సున్నీ ఇస్లామిక్‌ సంస్థ ముస్లిం బ్రదర్‌హుడ్‌లో చేరాడు. హమాస్‌ ఏర్పాటులో కీలకంగా మారిన సంస్థ ఇది. మాజీ ఉపాధ్యాయుడైన ఖలీద్‌ మెషాల్‌ 1992లో మిలిటెంట్ గ్రూప్ పొలిట్‌బ్యూరోలో వ్యవస్థాపక సభ్యుడిగా చేరారు. అతను 1996 -2017 మధ్య ఆ గ్రూప్‌నకు నాయకత్వం కూడా వహించాడు, అతని పదవీ కాలం ముగియడంతో దిగిపోయాడు. ఇప్పుడు హనియా హత్య తర్వాత అతని పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. మరోవైపు గాజాలో మిలిటెంట్‌ గ్రూప్‌ను నడిపిస్తున్న ఖీల్‌ అల్‌ హయ్యా పేరు కూడా ప్రచారంలో ఉన్నది.

హమాస్‌ చీఫ్‌ హత్యకు ఇజ్రాయెల్‌ నిఘా సంస్థే కారణమని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలో హామాస్‌ చీఫ్‌ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్‌కు సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి.

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో యూఎస్‌ డిఫెన్స్‌ సెక్రటరీ లాయిడ్‌ ఆస్టిన్‌ స్పందించారు. గతలలో లాగా ఇరాన్‌ మద్దతిస్తున్నమలీషియా ఇరాక్‌, సిరియాలోని అమెరికా దళాలపై దాడి చేయకపోవచ్చు. ఆత్మరక్షణలో భాగంగా మంగళవారం ఇరాక్‌లో స్ట్రైక్‌ చేసినట్లు భావిస్తున్నామని యూఎస్‌ అధికారులు తెలిపారు. 

Tags:    

Similar News