ఎయిడ్స్ రోగుల కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణలో ఎయిడ్స్ రోగుల కోసం 16 యంటీరిబ్రోవైరల్ థెరఫీ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

By :  Vamshi
Update: 2024-06-26 02:31 GMT

రాష్ట్రంలో ఎయిడ్స్ రోగుల కోసం నూతనంగా మరో 16 యంటీరిబ్రోవైరల్ థెరఫీ(ఏ ఆర్టీ ) కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం 17 కేంద్రాలున్నాయి. కొత్తగా వచ్చేవాటితో కలిపి , జిల్లాకు ఒకటి చొప్పున అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. అయితే ఆయా ఏఆర్టీ సెంటర్లను కేవలం మెడికల్ కాలేజీల్లో మాత్రమే ఏర్పాటు చేయనున్నారు.

నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకు అనుగుణంగా హెల్త్ సెక్రటరీ ఆదేశాల మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఒక్కో సెంటర్‌లో డాక్టర్‌తో పాటు మరో ఐదుగురు స్టాఫ్​ఉండనున్నారు. గతంలో ప్రపంచాన్ని వణికించిన హెచ్ఐవి మహమ్మారి ప్రస్తుతం కాస్త తగ్గినట్టు కనిపించినా, తెలుగు రాష్టాల్లో మాత్రం పంజా విసురుతుంది.

Tags:    

Similar News