కవిత జ్యుడీషియల్‌ కస్టడీ మరోసారి పొడిగింపు

ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. జులై 25 వరకు జ్యుడిషియల్‌ కస్టడీ పొడిగిస్తున్నట్లు రౌస్‌ అవెన్యూ కోర్టు ప్రకటించింది

By :  Raju
Update: 2024-07-03 07:40 GMT

ఢిల్లీ మద్యం ఈడీ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. ఈడీ కేసులో కవిత జ్యుడీషియల్‌ కస్టడీ నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో తీహార్‌ జైలులో ఉన్న ఆమెను అధికారులు వర్చువల్‌గా కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో జులై 25 వరకు జ్యుడిషియల్‌ కస్టడీ పొడిగిస్తున్నట్లు రౌస్‌ అవెన్యూ కోర్టు ప్రకటించింది. కవితతో పాటు ఆప్‌ నేత మనీష్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీని జులై 25 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈకేసులో విచారణను రౌస్‌ అవెన్యూ కోర్టు జులై 25కి వాయిదా వేసింది.

లిక్కర్‌ పాలసీ కేసులో కవితను మార్చి 15న న ఆమె నివాసంలో ఈడీ అరెస్టు చేసింది. ఈకేసులో బెయిల్‌ కోసం కవిత అభ్యర్థనలను కోర్టులు తోసిపుచ్చాయి. ఆమె జ్యుడీషియల్‌ కస్టడీని ఇప్పటికే పలుమార్లు పొడిగించిన సంగతి తెలిసింది.

Tags:    

Similar News