గాంధీ ఆస్పత్రి ఎదుట జూనియర్ డాక్టర్ల నిరసన

కళ్లకు గంతలు ధరించి ఉస్మానియ మెడికల్ కాలేజ్ జూనియర్ డాక్టర్లు నిరసన తెలియజేశారు.

By :  Vamshi
Update: 2024-06-22 10:40 GMT

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గాంధీ ఆసుపత్రి మెయిన్ బిల్డింగ్ వద్ద జూనియర్ డాక్టర్లు నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్‌లను పరిష్కరించాలని కోరారు. ప్రతి నెల క్రమం తప్పకుండా 1 తేదీన జీతాలు అందివ్వాలని కోరారు. తమకు రెగ్యులర్‌గా స్టైఫండ్స్ ఇవ్వాలని, శిథిలావస్థలో ఉన్న ఆసుపత్రి భవనలను నిర్మించాలని, ఏపీ విద్యార్థులకు ఉన్న 15% రిజర్వేషన్లను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఈనెల 24వ తేదీ నుంచి నిరవధిక సమ్మె నిర్వహిస్తామని హెచ్చారించారు. గ్రేటర్‌ పరిధిలోని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్‌, ఎంఎన్‌జే, ఎర్రగడ్డ ఛాతి దవాఖాన, మానసిక రోగుల దవాఖాన, వరంగల్‌ ఎంజీఎం దవాఖాన, ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో జూడాలు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు.

Tags:    

Similar News