జూన్‌ 25.. రాజ్యాంగ హత్యా దినం: కేంద్రం

దేశంలో ఎమర్జెన్సీ విధించిన జూన్‌ 25న రాజ్యాంగ హత్యా దినం (సంవిధాన్‌ హత్యా దివస్‌)గా జరుపుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

By :  Raju
Update: 2024-07-12 15:58 GMT

దేశంలో ఎమర్జెన్సీ విధించిన జూన్‌ 25న రాజ్యాంగ హత్యా దినం (సంవిధాన్‌ హత్యా దివస్‌)గా జరుపుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఎక్స్‌ ద్వారా వెల్లడించారు.




 




 



1975 జూన్‌ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించడం ద్వారా తన నియంతృత్వ ధోరణిని ప్రదర్శించడమే కాకుండా ప్రజాస్వామ్య ఆత్మను ఉరి తీశారని విమర్శించారు. ఏ తప్పు చేయకపోయినా లక్షలాదిమందిని జైళ్లలో నిర్బంధించారని, మీడియాపై ఆంక్షలు విధించారని విమర్శించారు. అందువల్ల ఏటా జూన్‌ 25న రాజ్యాంగ హత్యా దినం మోడీ ప్రభుత్వం నిర్ణయించినట్టు అమిత్‌ షా తెలిపారు.ఎమర్జెన్సీ సమయంలో ఎన్నో బాధలు అనుభవించిన వారిని స్మరించుకునే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర హోం మంత్రి తెలిపారు. 

Tags:    

Similar News