కోటి మంది యువతకు ఉద్యోగాలు : నిర్మలా సీతారామన్

500 పెద్ద కంపెనీల్లో కోటిమంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. వంద నగరాల్లో ప్లగ్‌ అండ్‌ ప్లే తరహాలో పారిశ్రామిక పార్కులు ఏర్పాట్లు చేయనున్నట్లు ఆర్థికమంత్రి వివరించారు.

By :  Raju
Update: 2024-07-23 06:34 GMT

చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఎంఎస్‌ఎంఈ క్లస్టర్లు, నూతన సిడ్‌బీ బ్యాంకు బ్రాంచ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. ఎగుమతులు, ఎగుమతుల సేవల కోసం ప్రత్యేక ప్లాట్‌ఫాం ఏర్పాటు చేస్తామన్నారు. 500 పెద్ద కంపెనీల్లో కోటిమంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. వంద నగరాల్లో ప్లగ్‌ అండ్‌ ప్లే తరహాలో పారిశ్రామిక పార్కులు ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు. 12 విస్తృతస్థాయి పారిశ్రామిక అభివృద్ధి కేంద్రానలు ఏర్పాటు చేయనున్నట్లు, పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె ఇండ్లను నిర్మించనున్నట్లు చెప్పారు.

కార్మికుల నివాసం కోసం పారిశ్రామిక కేంద్రాల్లో డార్మిటరీ తరహా ఇళ్ల నిర్మాణం చేస్తామన్నారు. మినరల్‌ మిషన్‌ ద్వారా జాతీయంగా, అంతర్జాతీయంగా కీలక ఖనిజాల గుర్తింపు, ఎగుమతులకు ప్రణాళిక,ఆఫ్‌షోర్‌ మైనింగ్‌కు నూతన విధానం,సాగరగర్భంలో ఖనిజ నిక్షేపాల అన్వేషణ, తవ్వకాల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామన్నారు. 

Tags:    

Similar News