తెలంగాణ కొత్త గవర్నర్‌గా జిష్ణు దేవ్‌ వర్మ

పలు రాష్ట్రాలకు నూతన గవర్నర్‌లను నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.ప్రస్తుతం తెలంగాణ ఇన్‌ఛార్జి గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ రిలీవ్ అయ్యారు.

By :  Raju
Update: 2024-07-28 02:26 GMT

పలు రాష్ట్రాలకు గవర్నర్‌లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు. దీనిలో భాగంగా తెలంగాణకు కొత్త గవర్నర్‌గా జిష్ణు దేవ్‌ వర్మ నియమితులయ్యారు.తెలంగాణతో పాటు చండీగఢ్‌, రాజస్థాన్‌, సిక్కిం, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, మేఘాలయ, మహారాష్ట్ర, అసోం, పంజాబ్‌ రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించారు.

మహారాష్ట్ర గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌, రాజస్థాన్‌ గవర్నర్‌గా హరిభావ్‌ కిషన్‌ రావ్‌ బాగ్డే, సిక్కిం గవర్నర్గా ఓం ప్రకాశ్‌ మాథుర్‌, ఝార్ఖండ్‌ గవర్నర్‌గా సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌, ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా రమెన్‌ డేకా, మేఘాలయ గవర్నర్‌గా సీహెచ్‌ విజయశంకర్‌, అసోం గవర్నర్‌గా లక్ష్మణ్ ప్రసాద్,  పంజాబ్‌ గవర్నర్‌గా గులాబ్‌ చంద్‌ కటారియా నియమితులయ్యారు. గులాబ్‌ కటారియాకు చండీగఢ్‌ అడ్మినిస్ట్రేటర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. 

ఎవరీ జిష్ణు దేవ్ వర్మ?

జిష్ణు దేవ్ వర్మ త్రిపుర రాష్ట్రానికి చెందినరాజ కుటుంబానికి చెందిన వ్యక్తి.1957 ఆగస్టు 15న జన్మించారు. రామ జన్మ భూమి ఉద్యమం సమయంలో బీజేపీలో చేరారు. 2018-2023 మధ్య త్రిపుర ఉప మఖ్యమంత్రిగా పనిచేశారు. బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడిగానూ పనిచేశారు. ప్రస్తుతం త్రిపుర గవర్నర్‌గా ఉన్న తెలంగాణ బీజేపీ నేత ఇంద్రసేనా రెడ్డి.

Tags:    

Similar News