కస్టమర్లకు జియో అదిరిపోయే ఆఫర్

జియో కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. అపరిమిత కాలింగ్, డేటా వంటి ప్రయోజనాలను అందించే కొత్త ఆఫర్లను జియో ఆవిష్కరించింది.

By :  Vamshi
Update: 2024-09-04 10:35 GMT

జియో కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. అపరిమిత కాలింగ్, డేటా వంటి ప్రయోజనాలను అందించే కొత్త ఆఫర్లను జియో ఆవిష్కరించింది. సాధారణంగా కాలింగ్, డేటా బెనిఫిట్స్ అందించే ప్లాన్స్ రేట్లు కనీసం రూ. 180 నుంచి రూ.200 మధ్య ఉంటాయి. అయితే మంత్లీ రూ.173 మాత్రమే ఆదిరిపోయే ఆఫర్ ప్రకటించనుంది. రూ.1,889 ప్లాన్‌ను జియో పరిచయం చేసింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులుగా ఉంది. ఈ ప్లాన్‌లో కస్టమర్లు దేశంలో ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. ఉచిత జాతీయ రోమింగ్, 3600 ఉచిత మెసేజులు, జియో అనుబంధ యాప్‌ల యాక్సెస్‌తో పాటు అదనంగా 24 జీబీల హైస్పీడ్ డేటా కూడా లభిస్తుంది. ఇటీవల దేశంలోని ప్రముఖ టెలికాన్ సర్వీస్ ప్రొవైడర్ జియో రీఛార్జ్ చార్జీలను భారీగా పెంచింది. దీంతో కస్టమర్లు బిఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే లక్షలాదిమంది యూజర్లు పోర్ట్ అయ్యారంటూ ఎన్నో కథనాలు కూడా వెలువడుతున్నాయి. దీంతో నష్ట నివారణకు దిగింది జియో. తాజాగా నయా వ్యాల్యూ యాడెడ్ రీచార్జ్ ప్లాన్లను ప్రకటించింది. సాధారణంగా కాల్స్, డేటా బెనిఫిట్స్ అందించే ప్లాన్స్ రేట్లు కనీసం రూ.180 నుంచి 200 మధ్య ఉంటాయి. టెలికాం రంగంలో పోటీతత్వం విపరీతంగా పెరిగిపోయింది. ఇతర కంపెనీలపై పై చేయి సాధించేందుకు ఒకదానికి మించి మరొకటి ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. మన దేశంలో జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా, బిఎస్ఎన్ఎల్ టెలికాం సేవలను అందిస్తున్నాయి. వీటన్నిటి మధ్య ప్రధానంగా పోటీ జియో, ఎయిర్టెల్, వి.ఐ మధ్య కనిపిస్తూ ఉంటుంది. జియో నెలవారీ ప్లాన్ పొందాలనుకుంటే రూ.189 రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంది. అపరిమిత వాయిస్ కాలింగ్, ఉచిత రోమింగ్, నెలకు 300 ఉచిత ఎస్ఎంఎస్‌లతో పాటు 2జీబీ డేటా కూడా పొందవచ్చు. వినియోగదారులు జియోటీవీ, జీయో సినిమా, జియో క్లౌడ్ వంటి జియో అనుబంధ యాప్‌ల సర్వీసులు పొందవచ్చు.

Tags:    

Similar News