కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్‌ విధానం మనీలాండరింగ్‌ కేసులో కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ లభించింది.

By :  Raju
Update: 2024-07-12 05:29 GMT

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. ఆయనకు మధ్యంతర బెయిల్‌ మంజూరైంది.మనీ లాండరింగ్‌ కేసులో మార్చి 21న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఈ అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు జస్టిస్‌ సంజయ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది.కేజ్రీవాల్‌ పిటిషన్‌ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈడీ కేసులో కేజ్రీవాలకు సంబంధించిన చట్టబద్ధత విస్తృత ధర్మాసనం తేలుస్తుందని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఈ కేసులో ఈడీకి అరెస్టు చేసే అధికారం, విధానం సహా మూడు ప్రశ్నలను లేవనెత్తారు. విస్తృత ధర్మాసనంలో ఈ కేసు తేలేవరకు మధ్యంతర బెయిల్‌ అమల్లో ఉంటుందని న్యాయమూర్తులు తెలిపారు..

కేజ్రీవాల్‌ 90రోజులు జైలు శిక్ష అనుభవించారని పేర్కొన్నది. కేజ్రీవాల్‌ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి అని ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగాలా వద్దా అన్నది ఆయన ఇష్టమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పార్టీలకు నిధులు సమకూర్చుకునే విషయంలో అనేక భేదాభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించాల్సి వస్తుందని జస్టిస్ సంజీవ్‌ఖన్నా వ్యాఖ్యనించారు. ఈ నేపథ్యంలోనే అన్ని అంశాలను పరిశీలించిన అరవింద్‌ కేజ్రీవాల్‌ ఒక ప్రజాప్రతినిధి అని ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తున్నట్టుగా ప్రకటించింది.

మద్యం విధానం కేసులో ఏప్రిల్‌ 9న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కేజ్రీవాల్‌ సవాల్‌ చేశారు. కేజ్రీవాల్‌, ఈడీ వాదనలు విన్న అనంతరం సుప్రీంకోర్టు మే 17న తీర్పు రిజర్వ్‌ చేసింది.జూన్‌ 20న కేజ్రీవాల్‌కు రౌస్‌ అవెన్యూ కోర్టు సాధారణ బెయిల్‌ మంజూరు చేసింది. సాధారణ బెయిల్‌ ఇచ్చిన మరుసటి రోజే ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. రౌస్‌ అవెన్యూ కోర్టు బెయిల్‌ ఆదేశాలపై గత నెల 25న ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. గత నెల 27న కేజ్రీవాల్‌ను అరెస్టు చేసి దర్యాప్తు సంస్థ కోర్టు ముందు హాజరుపరిచింది. అప్పటి నుంచి ఆయన జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.అయితే మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా సీబీఐ అరెస్టు చేసినందున తీహార్ జైలులోనే కొనసాగనున్నారు.

మరోవైపు సుప్రీంకోర్టు తీర్పును ఆమ్‌ ఆద్మీ పార్టీ స్వాగతించింది. సత్యమేవ జయతే అంటూ కేజ్రీవాల్‌ జాతీయ జెండా పట్టుకున్న ఫొటోను ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. 

Tags:    

Similar News