లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌పై విచారణ వాయిదా

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు జున్ 26న విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించింది.

By :  Vamshi
Update: 2024-06-24 08:46 GMT

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టులో జున్26కు వాయిదా వేసింది. ఈడీ వేసిన స్టే పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తుది ఉత్తర్వుల కోసం వేచి చూడాలని సూచించింది. సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేయడంతో కేజ్రీవాల్‌కు మళ్లీ నిరాశ ఎదురైంది. దీంతో ఢిల్లీ హైకోర్టు తీర్పును కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. బెయిల్‌‌ ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని ఆయన కోరారు. కేజ్రీవాల్ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఢిల్లీ సీఎం అభ్యర్థనను తోసిపుచ్చింది. బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు ఆర్డర్ ఇచ్చేవరకు వేచి చూడాలని సూచించింది.

ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీంలో కూడా ఎదురు దెబ్బ తగలడంతో కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కేసులో సహనిందితులు పొందిన డబ్బుతో కేజ్రీవాల్‌కు సంబంధం ఉందని ఈడీ వాదించింది. వేర్వేరు మార్గాల ద్వారా చరణ్‌ప్రీత్‌కు రూ.45 కోట్లు అందినట్లు ఆరోపించింది. కేజ్రీవాల్‌కు ఎన్నిసార్లు సమన్లు ఇచ్చినా ఉద్దేశపూర్వకంగా వాటిని పట్టించుకోలేదని, తొమ్మిదిసార్లు అలా జరిగినా తాము అరెస్టు చేయలేదని తెలిపింది. ఇక.. సౌత్‌ గ్రూప్‌ నుంచి రూ.100 కోట్లు అందాయని ఆరోపించినా దానికి ఆధారాలు లేవని, కొందరి వాంగ్మూలాల ఆధారంగానే కేసు నడుస్తోందని కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాదులు వాదించారు. అయితే ట్రయల్‌కోర్టు ఆ వాదనల్ని పరిగణనలోకి తీసుకోలేదు.

Tags:    

Similar News