దేశవాళీ జాతుల మొక్కలే పర్యావరణ నేస్తాలు : పవన్‌

వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న డిప్యూటీ సీఎం

By :  Raju
Update: 2024-08-30 03:45 GMT

దేశీయ మొక్కల పచ్చదనంతో రాష్ట్రం కళకళలాడాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని.. ఇది సామాజిక బాధ్యత అన్నారు. అన్య జాతుల మొక్కలు పెంచడం మానేద్దామన్న పవన్‌ దేశవాళీ జాతుల మొక్కలే పర్యావరణ నేస్తాలు అని పేర్కొన్నారు. వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

అరబ్‌ దేశాలే కానో కార్పస్‌ వద్దనుకున్నాయి. వాటిside effect అర్థం చేసుకుని ఆ దేశాలు ఈ మొక్కను వద్దనుకొని నిషేధించాయి. దేశంలో తెలంగాణ, కర్ణాటక, గుజరాత్‌, అసోం ప్రభుత్వాలు కూడా కానోకార్పస్‌ను నిషేధించాయి. కొనో కార్పస్‌ భూగర్భ జల సంపదను ఎక్కువగా వినియోగించుకోవడంతోపాటు చుట్టుపక్కల ఉన్నవారికి శ్వాస సంబంధ సమస్యలు వస్తాయి. అందరికీ మేలు చేసే మొక్కులే మన నేస్తాలు అని డిప్యూటీ సీఎం తెలిపారు. 

సీఎం, డిప్యూటీ సీఎం నరసరావుపేట పర్యటన రద్దు

పచ్చదనం పెంపొందించేందుకు వన మహోత్సవం పేరిట మొక్కలు నాటడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని సీఎం, డిప్యూటీ సీఎం ప్రారంభించాల్సింది. ఈ మేరకు పల్నాడు జిల్లా నరసరావు పేట జేఎన్టీయూ కాలేజీ ప్రాంగణంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే భారీ వర్షం కారణంగా సీఎం, డిప్యూటీ సీఎం నరసరావుపేట పర్యటన రద్దయ్యింది. భారీ వర్షం, సభా ప్రాంగణం బురదమయం కావడంతో కార్యక్రమానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. ప్రత్యామ్నాయంగా గుంటూరు జిల్లా పేరేచర్లలో వన మహోత్సవం నిర్వహించాలని యోచించారు. పేరేచర్లలోనూ వర్షం మొదలు కావడంతో అధికారులు మల్లగుల్లాలు పడ్డారు 

Tags:    

Similar News