జింబాబ్వే పై భారత్ విజయం..రాణించిన వాషింగ్టన్ సుందర్

హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత్, జింబాబ్వేపై 23 పరుగుల తేడాతో విజయం సాధించింది

By :  Vamshi
Update: 2024-07-10 14:37 GMT

జింబాబ్వేతో హ‌రారే వేదిక‌గా జ‌రుగుతున్న మూడో టీ20లో యువ భార‌త్ విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా మ‌రోసారి భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ (49 బంతుల్లో 66, 7 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), రుతురాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 49, 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) రాణించ‌డంతో టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్.. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 182 ప‌రుగులు చేసింది.

183 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన జింబాబ్వే 159/6కే భారత్ కట్టడి చేసింది. 23 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. డియాన్‌ మైయర్స్‌(65*)తో ఒంటరి పోరాడినా చేసిన ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో వాషింగ్టన్‌ 3, అవేశ్‌ 2, వికెట్లు తీయగా.. ఖలీల్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. అంతకుముందు ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్‌ 2-1తో ఆధిక్యంలో ఉంది.

Tags:    

Similar News