భారత్ ఆర్థిక రంగంలో దూసుకుపోతోంది : రాష్ట్రపతి

భారతదేశ 78వ స్వాతంత్య దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ ప్రజలందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు.

By :  Vamshi
Update: 2024-08-14 15:26 GMT

సామాజిక న్యాయమే ప్రధాని మోదీ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఎన్డీయే సర్కార్ ఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టింది. అభివృద్ధి చెందిన భారతదేశానికి 4 స్తంభాలుగా రైతులు, యువత, మహిళలు, పేదలు అని ద్రౌపది పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్రతి అన్నారు. మహిళ సాధికారతే కేంద్ర ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. భారత్ అభివృద్ధిలో పథంలో దూసుకుపోతుందని రాష్ట్రపతి తెలిపారు.

ఎందరెందరో సమరయోధుల పోరాట ఫలితంగా దేశానికి స్వాతంత్ర్య సిద్ధించిందని, భగత్ సింగ్, చంద్రశేఖర్, ఆజాద్, సుఖదేవ్ వంటి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు నిరుపమానమని రాష్ట్రపతి ఈ సందర్భంగా కొనియాడారు. ఆగస్టు 14వ తేదీన దేశ విభజన నాటి పీడకలను స్మరించుకునే రోజు ఇదని, విభజన సమయంలో వేలాది మంది బలవంతంగా దేశం విడిచివెళ్లారని, అనేక మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నాటి ట్రాజెడీని స్ఫురణకు తెచ్చుకుని, సమష్టిగా బాధిత కుటుంబాలకు బాసటగా నిలవాలని రాష్ట్రపతి అన్నారు.

Tags:    

Similar News