రికార్డుస్థాయికి సూచీలు

మదుపర్ల సంపదగా పరిగణించే, బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ మంగళవారం రూ. 1.56 లక్షల కోట్లు పెరిగి జీవితకాల గరిష్ఠమైన రూ. 451.27 లక్షల కోట్లు (5.41 లక్షల కోట్ల డాలర్లు)గా నమోదైంది.

By :  Raju
Update: 2024-07-10 02:32 GMT

రెండు రోజుల నష్టాల నుంచి పుంజుకున్న సూచీలు మంగళవారం రికార్డుస్థాయిలో దూసుకుపోయాయి. విదేశీ కొనుగోళ్ల మద్దతుతో వాహన, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లు రాణించాయి. దీంతో పాటు సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులు కుమ్మరించడంతో జీవన కాల గరిష్ఠాలకు చేరాయి .

ఉదయం 80,107,21 పాయింట్ల వద్ద లాభాలతో సెన్సెక్స్‌ రోజంతా అదే జోరు కొనసాగించింది. సూచీ, ఇంట్రాడే లో 80,397,17 వద్ద కొత్త గరిష్ఠాన్ని తాకింది. చివరికి 391.26 పాయింట్ల లాభంతో 80,351.64 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ కూడా 112.65 పాయింట్లు అందుకొని రికార్డుస్థాయి 24,443.20 వద్ద స్థిరపడింది.

మదుపర్ల సంపదగా పరిగణించే, బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ మంగళవారం రూ. 1.56 లక్షల కోట్లు పెరిగి జీవితకాల గరిష్ఠమైన రూ. 451.27 లక్షల కోట్లు (5.41 లక్షల కోట్ల డాలర్లు)గా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ 8న ఈ విలువ రూ. 400 లక్షల కోట్లకు చేరింది. అంటే మూడు నెలల్లోనే రూ. 50 లక్షల కోట్లకు పైగా సంపద పెరిగింది.

డాలర్‌తో పోలిస్తే రూపాయి పైసా విలువ పైసా పెరిగి 83.49 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.51 శాతం నష్టంతో 85.31 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.

Tags:    

Similar News