స్వాతంత్య్ర దినోత్సవం.. దేశ ప్రజలకు ప్రముఖుల శుభాకాంక్షలు

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ,బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, మెగాస్టార్‌ చిరంజీవి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

By :  Raju
Update: 2024-08-15 06:07 GMT

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని తమ నివాసాల్లో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌, శివరాజ్‌సింగ్‌లో జాతీయ జెండాను ఎగురవేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఏఐసీసీ హెడ్‌ క్వార్టర్స్‌లో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జాతీయ జెండాను ఆవిష్కరించారు.

మనం కష్టపడి సాధించుకున్న స్వాతంత్య్ర గర్వించదగిన వేడుక అని రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అన్నారు. ఎందరో దేశభక్తుల నిస్వార్థ త్యాగాల ఫలితంగా వచ్చిన స్వాతంత్య్రం చరిత్రలో నిలిచిపోతుందని గవర్నర్‌ ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు. త్రివర్ణ పతాకాన్ని గౌరవించి ఎగురవేస్తున్నప్పుడు హృదయాలు గర్వంతో ఉప్పొంగుతాయని రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహనీయుల పోరాటాలు, మరెందరో బలిదానాల ఫలితంగా సాధించుకున్న దేశ స్వాతంత్య్ర ఫలాలు చివరి గడప వరకు చేరిన నాడే సంపూర్ణ సార్థకత చేకూరుతుంది అన్నారు.మెగాస్టార్‌ చిరంజీవి దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో మంది చేసిన పోరాటాలు, త్యాగాలను స్మరించుకుందామని, వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు.

తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జెండా ఆవిష్కరించారు. ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విజయవాడలోని కాంగ్రెస్‌కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కాకినాడలో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొని జాతీయజెండాను ఎగురవేశారు.

Tags:    

Similar News