ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలకు పెరుగుతున్న ఆదరణ

దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) అమ్మకాలు ఊపందుకున్నాయి. జులైలో మొత్తం ఈవీ విక్రయాలు 1,79,038 యూనిట్లకు చేరుకున్నాయి.

By :  Raju
Update: 2024-08-07 04:06 GMT

దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) అమ్మకాలు ఊపందుకున్నాయి. జులైలో మొత్తం ఈవీ విక్రయాలు 1,79,038 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో నమోదైన 1,16, 221 యూనిట్లతో పోలిస్తే 55.2 శాతం వృద్ధి చెందాయి.

అదేసమయంలో ఎలక్ట్రిక్ బైక్స్‌ విక్రయాలు 96 శాతం పెరిగాయని ఆటో మొబైల్‌ డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడించింది. కంపెనీలు ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందించడం ఈ మొబిలిటీ ప్రమోషన్స్‌ను పొడిగించడమే దీనికి కారణమని పేర్కొన్నది. బైక్స్‌ జులై 1,07, 016 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో వీటి విక్రయాలు 54, 616 యూనిట్లకే పరిమితమయ్యాయి. ఈ విభాగంలో 95.94 శాతం వృద్ధి నమోదైంది. ఇక త్రీవిల్లర్‌ అమ్మకాలు 18.18 శాతం పెరిగి 63,667 యూనిట్లకు చేరుకున్నాయి. జులైలో టూవిలర్‌, త్రీ విలర్‌ ఈవీ విభాగంలో పెరుగుతున్న మార్కెట్‌ వాటానే దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ ను సూచిస్తున్నదని ఫాడ్‌ అధ్యక్షుడు మనీశ్‌ రాజ్‌ సింఘానియా తెలిపారు. 

Tags:    

Similar News