ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారానికి నిరసనగా.. నిమ్స్‌లో వైద్యులు ధర్నా

కోల్‌కతాలో జునియర్ వైద్యురాలిపై రేప్, మర్డర్ ఘటనను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజగా హైదరబాద్‌లో నిమ్స్‌లో డాక్టర్‌లు, పారమెడికల్ సిబ్బంది ఓపీ సేవలను బహిష్కరించారు.

By :  Vamshi
Update: 2024-08-16 09:39 GMT

కోల్‌కతాలో జునియర్ వైద్యురాలిపై రేప్, మర్డర్ ఘటనను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజగా హైదరబాద్‌లో నిమ్స్‌లో డాక్టర్‌లు, పారమెడికల్ సిబ్బంది ఓపీ సేవలను బహిష్కరించారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. ముందు మా ప్రాణాలు కాపాడండి.. తర్వాత పేషెంట్‌ల ప్రాణాలు కాపాడుతాం అంటూ వైద్యులు పేర్కొన్నారు. విధుల నిర్వహణలో వైద్యులు, సిబ్బంది రక్షణ కల్పించాలని కోరారు.

తమ నిరసన కారణంగా అత్యవసర సేవలకు ఆటంకం ఉండదని .. వైద్య సిబ్బంది రక్షణకు సెంట్రల్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ తేవాలని నిమ్స్ ఆస్పత్రి వైద్యులు డిమాండ్ చేశారు. ఏది జరిగిన రాజకీయ నాయకులు స్పందిస్తున్నారని.. కొన్ని రోజుల తర్వాత అంతా మరిచిపోతున్నారని వాపోయారు. డ్రాఫ్ట్‌ బిల్లులు ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నామని వైద్యులు అన్నారు. ఆర్‌జీ కార్‌ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రి ఆవరణలో నిన్న జరిగిన విధ్వంస ఘటనపై కోల్‌కతా హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టం చేసింది.

Tags:    

Similar News