ముంబైకి ఐఎండీ రెడ్ అలర్ట్..స్కూళ్లకు సెలవు

మహారాష్ట్రను భారీ వర్షం ముంచెత్తింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేని కుంభవృష్టి కురుస్తోంది. ఈ వర్షానికి ముంబై మహానగరం జలమయమైంది.

By :  Vamshi
Update: 2024-07-25 11:21 GMT

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణశాఖ రెడ్ అలర్ట్‌ జారీ చేసింది. మహారాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేని కుంభవృష్టి కురుస్తోంది. ఈ వర్షానికి ముంబై మహానగరం జలమయమైంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రోడ్లు నదులను తలపిస్తున్నాయి. నగరం మొత్తం జలదిగ్బంధంలోకి వెళ్లిపోయింది. నగరానికి నీటిని సరఫరా చేసే సరస్సులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు ఈ భారీ వర్షాల కారణంగా విమానాల రాకపోకలపై కూడా తీవ్ర ప్రభావం పడింది. వర్షం కారణంగా విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగిస్తున్నట్లు పేర్కొన్నాయి.

విమానాశ్రయాలకు బయల్దేరే ముందు ఫ్లైట్‌ స్టేటస్‌ తనిఖీ చేసుకోవాలంటూ ఇండిగో సంస్థ ప్రయాణికుల సూచించింది. స్పైస్‌జెట్‌ సైతం ఇదే తరహా అడ్వైజరీ జారీ చేసింది. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలు విమాన కార్యకలాపాలను తీవ్ర ప్రభావితం చేస్తున్నాయని ఎయిర్‌ ఇండియా సంస్థ తెలిపింది. ఈ కారణంగా విమానాల్లో కొన్నింటిని రద్దు చేయడం, మరికొన్నింటిని దారి మళ్లించడం వంటివి జరుగుతున్నట్లు పేర్కొంది. దీంతో ముంబై మున్సిపాల్ కార్పొరేషన్ పరిధిలోని విద్యాసంస్ధలకు అక్కడి అధికారులు సెలవు ప్రకటించారు. అలాగే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్, అజిత్‌పవార్‌లు ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News