పేదల ఇళ్ల జోలికి వస్తే ఉరుకోము : ఈటల రాజేందర్

హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. పేదల ఇళ్ల జోలికి వస్తే ఉరుకోమని ఈటల హెచ్చారించారు.

By :  Vamshi
Update: 2024-08-29 08:59 GMT

హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. పేదల ఇళ్ల జోలికి వస్తే ఉరుకోమని ఈటల హెచ్చారించారు. బడాబాబుల ఆక్రమణలపై జారిమనాలు వేసుకోండి. 40 ఏళ్లుగా ఉంటున్న పేదల జోలికి ఎందుకొస్తున్నారుని ప్రశ్నించారు. చెరువుల్లో పట్టా భూములు ఉంటే పేద ప్రజలకు ప్రత్యామ్నాయం చూపించాలని అన్నారు. అలాగే పేదలకు ఇచ్చిన నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని .. లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ ‌రెడ్డి సంగతి చూస్తామని ఎంపీ ఈటల చెప్పుకొచ్చారు.ఇదిలా ఉంటే హైదరాబాద్‌లోని మాదాపూర్‌, దుర్గం చేరువును ఆనుకోని ఉన్న అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో తిరుపతిరెడ్డి ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. కాగా ఆ ఇల్లు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఈ నోటీసులు ఇచ్చారు.

అలాగే దుర్గం చెరువును అనుకుని ఉన్న కావూరి హిల్స్, సెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ సొసైటీ వాసులకు కూడా హైడ్రా నోటీసులు జారీ చేసింది. అలాగే నెల రోజుల్లో అక్రమ కట్టడాలు అన్ని కూల్చేయాలని నోటీసుల్లో తెలిపింది. నగరంలో బఫర్ జోన్‌ పరిధిలో నిర్మాణల కూల్చివేతలపై హైకోర్టు వ్యాఖ్యల నేపధ్యంలో సీఎస్ శాంతికుమారి సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో వివిధ అంశాలపై చర్చించేందుకు హైడ్రా, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమావేశమయ్యారు. కూల్చివేతలపై లీగల్ సమస్యలు రాకుండా ఏం చేయాలో చర్చించారు. ఈ సమావేశంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు.

Tags:    

Similar News