ప్రభుత్వం స్పందించకుంటే మేమే పంప్‌హౌస్‌లు ఆన్‌ చేస్తాం

ఆగస్టు 2 లోపు కాళేశ్వరం పరిధిలోని ప్రాజెక్టుల్లో నీళ్లు నింపాలని, ప్రభుత్వం స్పందించకుంటే 50 వేల మంది రైతులతో వచ్చి మేమే పంప్‌హౌస్‌లు ఆన్‌ చేస్తామని కేటీఆర్‌ హెచ్చరించారు.

By :  Raju
Update: 2024-07-26 07:06 GMT

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ చేసిన అసత్య ప్రచారాలు గోదావరి వరదలో కొట్టుకుపోయాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో పంటల సాగు కోసం నీళ్లు పరిస్థితి లేదని, గతంలో నీటి సమస్య లేదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేత్రస్థాయి పరిశీలనలో భాగంగా కేటీఆర్‌ నేతృత్వంలోని ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీ బృందం కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను పరిశీలించింది. ఈసందర్బంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. గతంలో నీటి సమస్య ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో కరువు అనే మాట వినపడకూడదనే కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని తెలిపారు.

ఆగస్టు 2 లోపు కాళేశ్వరం పరిధిలోని ప్రాజెక్టుల్లో నీళ్లు నింపాలని, ప్రభుత్వం స్పందించకుంటే 50 వేల మంది రైతులతో వచ్చి మేమే పంప్‌హౌస్‌లు ఆన్‌ చేస్తామని కేటీఆర్‌ హెచ్చరించారు.పంప్‌హౌస్‌లు ఆన్‌ చేయడానికి ఎలాంటి ఇబ్బందులు లేవని ఇంజనీర్లు చెప్పారు అసెంబ్లీ సమావేశాల్లోపు ప్రభుత్వానికి గడువు విధిస్తున్నామని, మేము కూడా అసెంబ్లీ లో ఈ అంశాన్ని లేవనెత్తుతామన్నారు. గోదావరిలో నీళ్లున్నాయి. కానీ ప్రభుత్వానికి నీళ్లు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి మనసు లేదన్నారు. అసెంబ్లీ సమావేశాల్లోపు పంప్‌హౌస్‌లు ఆన్‌ చేయాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. 

Tags:    

Similar News