బఫర్ జోన్ లో నా ఇల్లు ఉంటే వెంటనే కూల్చేయండి : మంత్రి పొంగులేటి
హైదరాబాద్‌లో తన ఇళ్లు బఫర్ జోన్లో ఉంటే వేంటనే కూల్చయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.
హైదరాబాద్‌లో తన ఇళ్లు బఫర్ జోన్లో ఉంటే వేంటనే కూల్చయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని భూముల్లో నిర్మాణాలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటివరకు అలాంటి స్థలాల్లో కట్టిన కట్టడాలను గుర్తిస్తున్నాం.. అవన్నీ కూల్చివేస్తాం అని అన్నారు. హిమాయత్ సాగర్ ప్రాంతంలోని ఎఫ్టీఎల్ పరిధిలో తనకు ఫామ్‌హౌజ్ ఉందని బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడడ్డారు.
ఒకవేళ తనకు ఫామ్‌హౌజ్ ఉన్నది వాస్తవమే అయితే.. అది నింబంధనలకు విరుద్ధంగా ఉంటే.. కూల్చివేయాలని నేనే రంగనాథ్ కి అదేశిస్తున్నారు. రేషన్ కార్డులను రెండు విభజించి రేషన్ కార్డుగా, హెల్త్ కార్డుగా మారుస్తామని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా రుణమాఫీ అమలు చేసి చూపించామన్నారు. అది మాకు రైతుల మీదున్న చిత్తశుద్ధి అని వెల్లడించారు. మిగతా ఖర్చులను తగ్గించి రైతులకు మేలు చేసే ప్రయత్నాలు చేస్తున్నామని. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేశామని చెప్పారు.