హరీశ్‌రావు సిగ్గు ఉంటే రాజీనామా చేయ్ : రేవంత్‌రెడ్డి

‘‘వరంగల్‌ వేదికగా తెలంగాణ రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ మాట ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు రూ.31వేల కోట్లతో రుణమాఫీ చేశామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

By :  Vamshi
Update: 2024-08-15 12:34 GMT

ఆగస్టు 15లోగా కాంగ్రెస్‌ ప్రభుత్వం రుణ మాఫీ చేస్తే సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాన్న హరీశ్‌రావు వెంటనే తన పదవిని వీడలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. లేదంటే తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలి. అమర వీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలి. తాను విసిరిన సవాల్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు హరీశ్‌రావు చెప్పాలి’’ అని సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ‘సాగుకు జీవం.. రైతుకు ఊతం’ పేరుతో ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.

ఓరుగల్లు వేదికగా రైతు సంఘర్షణ సభలో ప్రవేశపెట్టిన వరంగల్ డిక్లరేషన్‌లో రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ మాట ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు రూ.31వేల కోట్లతో రుణమాఫీ చేశామని సీఎం అన్నారు. ఖమ్మం గడ్డ కాంగ్రెస్‌ అడ్డా. ఈ జిల్లా రైతాంగానికి అండగా నిలిచేందుకే ఈ ప్రాంతానికి వచ్చామన్నారు. 2026 పంద్రాగస్టు లోపు సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఖమ్మం జిల్లాలోని 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందిందే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా 4.5లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తాం. ఆరు గ్యారంటీల అమలుకు నిరంతరం కష్టపడుతున్నాం’’ అని సీఎం తెలిపారు. ఖమ్మం జిల్లాలో కృష్ణ నది జలాలు పారక పోతే గోదావరి జలాలు పంటలు సాగుకు ఇస్తాం అని సీఎం అన్నారు.

ప్రస్తుతం పది వేల కోట్లు సీతారామ ప్రాజెక్ట్ కి అవసరం. 2026 వరకు సీతారామ పూర్తి చేస్తాం. మాట ఇస్తున్నాము.. ఎన్ని వేల కోట్లు అవసరం అయిన ఇస్తాం.. ఏడు లక్షల ఎకరాలకు సాగు నీరు ఇస్తామన్నారు. మున్నేరు నది మీద 32 టిఎంసి రిజర్వాయర్ గ్రావిటీ ద్వారా ఇచ్చేందుకు కృషి చేస్తాం. వీరభద్రుడి పేరు మీద 15 టీఎంసీల రిజర్వాయర్ నిర్మాణం కూడా చేపడతాం. అయితే ఈ గొప్పతనం అంతా ఖమ్మం జిల్లాకే దక్కుతుంది అని రేవంత్ అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Tags:    

Similar News