'హైడ్రా'ది ఓన్లీ యాక్షన్‌: రంగనాథ్‌

హైడ్రా నోటీసులు ఇవ్వదు.. కూల్చడమే అని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ అన్నారు.

By :  Raju
Update: 2024-08-27 14:34 GMT

హైడ్రా కూల్చివేతలపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష నేతలను రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికే హైడ్రాను ముందు పెట్టి అధికారపార్టీ హైడ్రామా కొనసాగిస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైడ్రా చర్యలపై వివాదాల నేపథ్యంలో దీనిపై స్పందించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ మాట్లాడుతూ..

రాజకీయ చదరంగంలో హైడ్రా పావుగా మారదలుచుకోలేదన్నారు. ఓవైసీ, మల్లారెడ్డి అనేది చూడమని, విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తామని చెప్పారు. చెరువులను ఆక్రమించి కాలేజీ భవనాలు కట్టడం వాళ్ల తప్పే అయి ఉండొచ్చు. ఎఫ్‌టీఎల్‌ అనేది ముఖ్యమైన అంశమే అన్నారు. దానికంటే విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమన్నారు. ఓవైసీ, మల్లారెడ్డి లాంటి వ్యక్తుల కాలేజీలకు సమయం ఇస్తామన్నారు. పార్టీలకు అతీతంగా మా చర్యలు ఉంటాయన్నారు. ధర్మసత్రమైనా ఎఫ్‌టీఎల్‌లో ఉంటే కూల్చేస్తామన్నారు. 


Tags:    

Similar News