హైదరాబాద్‌ అభివృద్ధి కోసమే హైడ్రా వ్యవస్థ: సీఎం రేవంత్‌

గోపన్‌పల్లిలో ఎకరం రూ. 100 కోట్లు పలుకుతున్నది. ఇక్కడికి వచ్చిన ఐటీ, ఫార్మా సంస్థల వల్ల భూమి ధర పెరిగిందని సీఎం తెలిపారు.

By :  Raju
Update: 2024-07-20 10:02 GMT

గోపన్‌పల్లి ఫైఓవర్‌ ద్వారా శేరిలింగంపల్లి అభివృద్ధి చెందుతుందని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వానిది అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గోపన్‌ పల్లి ఫైఓవర్‌ను సీఎం ప్రారంభించారు. జెండా ఊపి ఫ్లైఓవర్‌పైకి బైకర్స్‌ను అనుమతించారు.

అనంతరం సీఎం మాట్లాడుతూ.. హైదరాబాద్‌ అభివృద్ధికి హైడ్రా వ్యవస్థను తీసుకు వస్తున్నామన్నారు. మూసీ నదిని అభివృద్ధి చేసే బాధ్యత నాది అన్నారు. ఐదేళ్లలో 1.50 లక్షల కోట్లతో మూసీని అభివృద్ధి చేస్తామన్నారు. లండన్ థెమ్స్ నదిలా మూసీ నదిని లక్షన్నర కోట్లతో సుందరీకరించబోతున్నామన్నారు. మూసీ రివర్ డెవలప్మెంట్ కు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అందుకు త్వరలోనే ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్నారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా అభివృద్ధి చేసుకోవడమే మన ముందున్న లక్ష్యమని తెలిపారు.




 


గోపన్‌పల్లిలో ఎకరం రూ. 100 కోట్లు పలుకుతున్నది. ఇక్కడికి వచ్చిన ఐటీ, ఫార్మా సంస్థల వల్ల భూమి ధర పెరిగిందని సీఎం తెలిపారు.తెలంగాణ కు 65 శాతం ఆదాయం హైదరాబాద్‌-సికింద్రాబాద్‌ జంట నగరాల నుంచే వస్తున్నది. హైదరాబాద్‌కు ఎవరు వచ్చినా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. దేశం నలుమూలల నుంచి ఎవరు వచ్చినా అక్కున చేర్చుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గాంధీ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News