టెక్సాస్‌లో హరికేన్‌ బీభత్సం

అమెరికాలోని టెక్సాస్‌లో హరికేన్‌ బీభత్సం సృష్టించింది. భీకర గాలులు, వర్షాల కారణంగా పెద్ద ఎత్తున చెట్లు విరిగి పడగా.. పలు రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

By :  Raju
Update: 2024-07-09 09:07 GMT

అమెరికాలోని టెక్సాస్‌లో హరికేన్‌ బీభత్సం సృష్టించింది. భీకర గాలులు, వర్షాల కారణంగా పెద్ద ఎత్తున చెట్లు విరిగి పడగా.. పలు రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

తుపాను కారణంగా చోటుచేసుకున్న ప్రమాదంలో నలుగురు చనిపోయారు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి లక్షలాదిమంది అంధకారంలో మగ్గుతున్నారు. చెట్లు విరిగి ఇండ్లపై పడటంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా..వరద నీటిలో చిక్కుకుని హ్యూస్టన్‌ పోలీస్‌ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగి మృతి చెందారు. తూర్పు టెక్సాస్‌, పశ్చిమ లూసియానా, ఆర్కాన్సస్‌లో వరద పరిస్థితి తీవ్రంగా ఉన్నది.

తుపాను తీవ్రతను దృష్టిలో పెట్టుకుని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపర సంస్థలు మూతపడ్డాయి. వరద ప్రభావిత ప్రాంత ప్రజలు ఇండ్లకే పరిమితం కావాలని అధికారులు సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావస చర్యలను వేగవంతం చేసినట్లు వివరించారు. దీనికోసం సుమారు 11,500 మందిని మోహరించినట్లు వెల్లడించారు. 

Tags:    

Similar News