రుణ మాఫీ ఎట్లా చేద్దాం?

రుణమాఫీ ఎట్లా చేద్దాం.. రేవంత్ సర్కారు మల్లగుల్లాలు.. భూముల కుదువ, లోన్లు తేవడంపై ఫోకస్.. కేబినెట్ భేటీలో నిర్ణయించే అవకాశం ఉన్నది. రుణమాఫీతో పాటు ఇతర అంశాలను చర్చించడానికి ఈ నెల 21న తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం కానున్నట్టు సమాచారం.

By :  Raju
Update: 2024-06-19 10:07 GMT

రుణమాఫీ ఎట్లా చేద్దాం.. రేవంత్ సర్కారు మల్లగుల్లాలు.. భూముల కుదువ, లోన్లు తేవడంపై ఫోకస్.. కేబినెట్ భేటీలో నిర్ణయించే అవకాశం ఉన్నది. రుణమాఫీతో పాటు ఇతర అంశాలను చర్చించడానికి ఈ నెల 21న తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం కానున్నట్టు సమాచారం. ఆగస్టు 15వరకు రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి అనేకసార్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం మంత్రులు, అధికారులతో వరుసగా భేటీ అవుతున్నారు. రుణమాఫీకి అర్హతలు, నిధుల సేకరణ, విధివిధానాలపై కసరత్తు కొలిక్కి వస్తున్నది. కిసాన్‌ సమ్మాన్‌ నిధి అర్హతలనే ప్రాతిపదికగా తీసుకోవడంతో పాటు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. రైతు భరోసా, రైతు బీమా, పంటల బీమాకు కూడా ఇవే అర్హతలను ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. వీటన్నింటిపై క్యాబినెట్‌లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

హైదారాబాద్‌లోని ఏపీ ఆస్తులతోపాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు, బడ్జెట్‌ పద్దులపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉన్నది. బడ్జెట్‌ సమావేశాలు వచ్చే నెలాఖరున ప్రారంభం కానున్నందున రైతు రుణమాఫీ విధివిధానాలపై చర్చించేందుకు అవసరమైతే ఈ నెలాఖరున ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే చర్చ కూడా ప్రభుత్వం చేస్తున్నట్టు సమాచారం. 

Tags:    

Similar News