వరద బాధితులకు నిహారిక విరాళం ఎంతంటే?

మెగా డాటర్ నిహారిక విజయవాడ వరద ముంపునకు గురైన 10 గ్రామాలకు రూ.50 వేల చొప్పున రూ.5 లక్షలు విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా(ఇన్‌స్టాగ్రామ్) వేదికగా తెలిపారు.

By :  Vamshi
Update: 2024-09-06 15:47 GMT

మెగా డాటర్ నిహారిక విజయవాడ వరద ముంపునకు గురైన 10 గ్రామాలకు రూ.50 వేల చొప్పున రూ.5 లక్షలు విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా(ఇన్‌స్టాగ్రామ్) వేదికగా తెలిపారు. భారీ వర్షాలు, వరదలతో విజయవాడ రూరల్ ఏరియాలో అనేక గ్రామాలు నీట మునగడం, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుండటం నాకు చాలా బాధ కలిగించిందని. ఇటువంటి ప్రకృతి విపత్తులో ఎక్కువగా ఇబ్బందులు పడేది కేవలం గ్రామీణ ప్రాంత ప్రజలే.

నేను పుట్టిన పెరిగిన వాతావరణం అంతా నగరంలోనే అయినా కూడా మా పెద్దవారు అందరూ రూరల్ ప్రాంతాల నుంచి వచ్చినవారే కాబట్టి వారు చెప్పే అనుభవాలు విన్న దృష్ట్యా నాకు గ్రామీణ వాతావరణంపై ఎంతో మక్కువ ఉందన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం అయినటువంటి మా బాబాయ్ పవన్ కల్యాణ్‌ తో పాటు మా ఫ్యామిలీ అంతా బాధితులకు అండగా ఉండటం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. నేను కూడా ఈ విపత్కర సమయంలో ఉడతా భక్తిగా వరద ముంపునకు గురైన ఒక పది గ్రామాలకు రూ.50 వేల చొప్పున రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను’ కొణిదెల నిహారిక సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

Tags:    

Similar News