సీజనల్ వ్యాధుల నివారణకు ఇంటింటి సర్వే నిర్వహించాలి : మంత్రి దామోదర్

సీజనల్ వ్యాధుల నివారణ కోసం ఇంటింటికి తిరిగి జర సర్వే నిర్వహించాలని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ లను మంత్రి దామోదర్ ఆదేశించారు.

By :  Vamshi
Update: 2024-07-23 14:08 GMT

వర్ష కాలంలో సీజనల్ వ్యాధుల నివారణకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించాలని రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి వైరల్ ఫీవర్ లను అరికట్టడానికి అవసరమైన మందులను ఇంటింటికి తిరిగి జన సర్వే నిర్వహించి బాధితులకు అవసరమైన మందులను అందజేయాలని మంత్రి అధికారులను, వైద్య సిబ్బందిని ఆదేశించారు.

సీజనల్ వ్యాధుల బారిన పడిన బాధితులకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అండగా నిలవాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ఈ జర సర్వేలో 1st & 2nd ANM లు, ఆశ వర్కర్లు, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్, మల్టీపర్పస్ హెల్త్ సూపర్వైజర్లు ఇంటింటికి తిరిగి వైరల్ ఫీవర్ ల బారిన పడిన బాధితులకు తక్షణ వైద్య సాయం అందించుటతో పాటు అవసరమైన మందులను అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News