నా ఛారిటీని కుట్రతో రద్దు చేయించారు : కేఏ పాల్

సదాశివ పేట్‌లో తన ఛారిటీని కావాలనే కొంతమంది కుట్రతో రద్దు చేయించారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు.

By :  Vamshi
Update: 2024-08-17 10:20 GMT

సంగారెడ్డి జిల్లా సదాశివ పేట్‌లో కబ్జాకు గురైన తన ఛారిటీ భూములపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కలిశారు. తన చారిటీని కావాలనే కొంతమంది కుట్రతో రద్దు చేయించారని కేఏ పాల్ ఆరోపించారు. ట్రస్టు ద్వారా సుమారు 53 వేల మందికి ఉచితంగా భోజనం పెట్టి కడుపు నింపాని అన్నారు.

అదేవిధంగా భూములను లాక్కునేందుకు తమపై దాడులు చేసిన బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. కావాలని తన ఛారిటీని కొంతమంది కుట్రతో రద్దు చేయించారని ఆరోపించారు. కే.ఏ.పాల్ ఆయన నిత్యం ఏదో ఒక సందర్భంలో వార్తల్లో నిలుస్తుంటాడు. తరుచూ వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయన వాస్తవాలు చెప్పినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఎవ్వరూ నమ్మడం లేదు. 

Tags:    

Similar News