గ్రూప్‌-1 పోస్టుల భర్తీ వ్యవహారంలో హైకోర్టు నోటీసులు

గ్రూప్‌-1 పోస్టుల భర్తీ వ్యవహారంలో రిజర్వేషన్ల అంశంపై వివరణ ఇవ్వాలంటూ టీజీపీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

By :  Raju
Update: 2024-08-30 05:05 GMT

గ్రూప్‌-1 పోస్టుల భర్తీ వ్యవహారంలో రిజర్వేషన్ల అంశంపై వివరణ ఇవ్వాలంటూ టీజీపీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను సెప్టెంబర్‌ 27కు వాయిదా వేసింది.

గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి సంబంధించి జీవో 55 ని సవరిస్తూ తెచ్చిన జీవో 29ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో నలుగురు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ కె. శరత్‌ విచారణ చేపట్టగా..గ్రూప్‌-1 మెయిన్స్‌ కు 1:50 అభ్యర్థుల ఎంపికకు సంబంధించి రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. దీంతో రిజర్వుడు కేటగిరి అభ్యర్థులకు అన్యాయం జరుగుతున్నదన్నారు. కొన్ని విభాగాల్లో 1:50 దాటిందని ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని తెలిపారు. ప్రభుత్వం తీసుకువచ్చిన సవరణ జీవో 29ని రద్దు చేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి ప్రభుత్వానికి, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు నోటీసులు ఇస్తూ..విచారణను సెప్టెంబర్‌ 27కు వాయిదా వేశారు. 

Tags:    

Similar News