భారత్-బంగ్లా సరిహద్దుల్లో హై అలర్ట్..భారీగా బలగాలు మోహరింపు

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. బంగ్లాలో జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో భారత్ సరిహద్దు ప్రాంతల్లో భద్రతను కట్టదిట్టం చేశారు

Update: 2024-08-05 10:57 GMT

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. బంగ్లాలో జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో భారత్ సరిహద్దు ప్రాంతల్లో భద్రతను కట్టదిట్టం చేశారు. ఇప్పటికే దేశ సరిహద్దు భద్రతా దళం డీజీ కోల్‌కతా చేరుకుని అక్కడ పరిస్థతిని సమీక్షిస్తున్నారు. కాగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చెలరిగిన హింస నేపథ్యంలో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆందోళనకారులు ఆయుధాలను చేతపట్టి వాహనాలు, దుకాణాలు, కార్యాలయాలను ధ్వంసం, దగ్ధం చేస్తున్నారు.

పోలీస్‌ స్టేషన్లపై అధికార పార్టీ నేతల నివాసాలు, కార్యాలయాలపై కూడా దాడులకు తెగబడుతున్నారు. ఇవాళ వేలాది మంది నిరసనకారులు రాజధాని ఢాకాలో విధ్వంసం సృష్టించారు. జాతిపిత షేక్‌ ముజిబుర్‌ విగ్రహాన్ని ధ్వసం చేశారు. ఇక ఢాకాలోని పీఎం అధికారిక నివాసం గణభబన్‌ను ముట్టడించారు. కొందరు నిరసనకారులు పీఎం నివాసంలోకి చొచ్చుకెళ్లారు. దీంతో బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా , ఆమె సోదరి షేక్‌ రెహానా బంగ్లాను వీడి సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ అల్లర్లలో ఇప్పటి వరకూ 300 మందికిపైగా మృతి చెందినట్లు స్థానిక మీడియా పేర్కొన్నాది

Tags:    

Similar News