వయనాడ్‌కు హీరో మోహన్‌లాల్ రూ.3 కోట్ల విరాళం

వయనాడ్‌కు మలయాళ నటుడు మోహన్‌లాల్ భారీ విరాళం ప్రకటించారు.

By :  Vamshi
Update: 2024-08-03 10:17 GMT

కొండ చరియలు విరిగిపడిన 358 మంది ప్రాణాలు కోల్పోయి విపత్కర పరిస్థితిలో ఉన్న కేరళ రాష్ట్రం వయనాడ్‌కు మలయాళ నటుడు మోహన్‌లాల్ భారీ విరాళం ప్రకటించారు. వయనాడ్ బాధితులకు పునరాపాసా కోసం మోహన్‌లాల్ పౌండేషన్ ద్వారా రూ.3 కోట్ల అందించనున్నట్లు తెలిపారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరింత ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొన్నారు. టెరిటోరియల్‌ ఆర్మీలో లెఫ్టినెంట్‌ కల్నల్‌గా ఉన్న మోహన్‌లాల్‌..కొండచరియలు విరిగిపడిన సందర్శించారు. అనంతరం సైనికులతో సమావేశం అయినారు. కోజికోడ్‌ నుంచి రోడ్‌ మార్గంలో వయనాడ్‌కు వెళ్లి ఆర్మీ అధికారులతో చర్చలు జరిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ అవుతున్నాయి. మోహన్ లాల్ పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ కష్టకాలంలో బాధితులను ఆదుకునేందుకు పలువురు ప్ర‌ముఖులు తమ వంతు సాయం అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ తారలు, రాజకీయ నేతలు కేరళ సీఎం సహాయనిధికి విరాళాలు అందించిన విషయం తెలిసిందే .తాజాగా కర్ణాటక సర్కార్ కూడా కేరళ రాష్ట్రానికి ఆపన్న హస్తం అందించింది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో బాధితులకు 100 ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ట్వీట్టర్ వేదికగా తెలిపారు. విప‌త్క‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న కేర‌ళ‌కు త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని తెలిపారు.

Tags:    

Similar News