తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు

Heavy rains in Telangana for four days

By :  Vamshi
Update: 2024-08-30 13:51 GMT

తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం రేపటికీ వాయుగుండంగా మారే అవకాశముందని ఐఎండీ పేర్కొన్నాది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్టు తెలిపారు.

తెలంగాణలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు అక్కడక్కడ ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు భారీ వర్షాలు కురిసే నేపధ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. తీరం వెంబడి బలమైన గాలులు వీయనున్నాయి. సముద్రంలో భారీగా అలలు వస్తాయని.. మత్య్సకారుల వేట పై నిషేధం విధించారు. హైదరాబాద్‌లో మోస్తారు నుంచి భారీ వర్షాలు అవకాశ్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Tags:    

Similar News