నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు

నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది.

By :  Raju
Update: 2024-07-17 04:18 GMT

తెలంగాణ రాష్ట్రంలో నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. రేపటి నుంచి మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ హెచ్చరికలు జారీచేసింది.

ముఖ్యంగా తూరు, ఉత్తర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ జిల్లాల్లో 11.5 నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదు కానున్నట్లు వెల్లడించింది.ఈదురు గాలులకు, చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడటం, విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడం, లోతట్టు ప్రాంతాల్లో వరద ముప్పు ఏర్పడటం వంటివి జరగవచ్చని కాబట్టి ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. 

Tags:    

Similar News