తెలంగాణలో రేపు భారీ వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

By :  Vamshi
Update: 2024-07-24 13:01 GMT

తెలంగాణలో పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి జిల్లాలో భారీ వానలు పడతాయని ఐఎండీ హెచ్చారించింది. ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ వద్ద అల్పపీడనం కేంద్రీకృతమైందని.. ప్రస్తుతం తూర్పు మధ్యప్రదేశ్‌ మీదుగా కొనసాగుతుందని.. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఉందని తెలిపింది.

ఆవర్తనం సగటున సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని.. ఎత్తుకు వెళ్లేకొద్దీ ఆగ్నేయ దిశగా వొంగి ఉందని పేర్కొంది. నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Tags:    

Similar News