తెలంగాణలో నేడు, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు

కొమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతాయని ఆ జిల్లాలకు ఎల్లో హెచ్చరికల జారీ

By :  Raju
Update: 2024-09-03 11:37 GMT

తెలంగాణలో పలు జిల్లాల్లో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు (మంగళవారం) కొమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగాం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ ప్రకటించింది. రేపు (బుధవారం) కొమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతాయని ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు.

మధ్య విదర్భ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రస్తుతం బలహీనపడి పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమైనట్లు చెప్పారు. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉన్నదని వెల్లడించారు. కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 3.1 నుంచి 5.8 కి.మీ వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొన్నారు. 

Tags:    

Similar News