రాష్ట్రంలో నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. దీంతో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా..కోయగూడెం ఓపెన్‌ కాస్ట్‌ లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

By :  Raju
Update: 2024-08-07 05:53 GMT

తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్‌, కుమురంభీం, మంచిర్యాల, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పలు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం, అశ్వరావుపేట, ములకలపల్లి మండలాల్లో ఎడతెరిపి లేని వర్షం పడుతున్నది. దమ్మపేట, భద్రాచలం, అన్నపురెడ్డిపల్లి, చింతకాని, బూర్గంపాడు, కూసుమంచి లో భారీగా వర్షం కురుస్తున్నది. టేకులపల్లి, ఆళ్లపలి పినపాక, మణుగూరు మండలాల్లో విస్తరంగా వానలు పడుతున్నాయి. దీంతో టేకులపల్లి మండలం కోయగూడెం ఓపెన్‌ కాస్ట్‌ లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో తెల్లవారుజాము నుంచే భారీ వర్షం కురుస్తున్నది. రామాలయం, విస్తా కాంప్లెక్స్‌, అన్నదాన సత్రం చుట్టూ వర్షం నీరు నిలిచిపోయింది. ఆలయం పడమర మెట్ల వద్ద నీళ్లు నిలవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. 

Tags:    

Similar News